UPDATED 30th NOVEMBER 2017 THURSDAY 7:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల మెకానికల్ డిపార్ట్ మెంట్ ప్రొఫెసర్ వింజమూరి వెంకట కామేష్ కు కాకినాడ జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రధానం చేసినట్లు ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెకానికల్ విభాగంలో కామేష్ సమర్పించిన " టోపోలోజికల్ సింథసిస్ అండ్ అనాలసిస్ ఆఫ్ ఎపిసైక్లిక్ గేర్ ట్రైన్స్ యూజింగ్ గ్రాఫ్ థియరీ" థీసిస్ కు ఈ డాక్టరేట్ పొందినట్లు తెలిపారు. అనంతరం ప్రొఫెసర్ కామేష్ మాట్లాడుతూ జె.ఎన్.టి.యూ.కె. విశ్రాంత ఆచార్యులు డాక్టర్ కె. మల్లిఖార్జునరావు, శ్రీ వాసవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, నందమూరి ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.బి. శ్రీనివాసరావుల నిర్దేశకత్వంలో ఈ పి.హెచ్.డి ని సమర్పించినట్లు తెలిపారు. తమ కళాశాలలో పనిచేస్తున్న ప్రొఫెసర్ కామేష్ డాక్టరేట్ పొందడం పట్ల ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి అభినందనలు తెలియచేస్తూ ప్రతీ అధ్యాపకుడు కామేష్ ను ఆదర్శంగా తీసుకుని ఉన్నత విద్యను అభ్యసించాలని, ఇందుకు ఆదిత్య యాజమాన్యం వారికి పూర్తి సహాయసహకారాలు అందిస్తుందన్నారు. అలాగే ఇంజనీరింగ్ క్యాంపస్ డైరెక్టర్, ప్రిన్సిపాల్స్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి , డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, వైస్ ప్రిన్సిపాల్స్ ప్రొఫెసర్ వల్లెం శ్రీనివాసరావు, డాక్టర్ ఎస్. రమాశ్రీ, ప్రొఫెసర్ ఎ. రామకృష్ణ, వివిధ శాఖాధిపతులు, తదితరులు కామేష్ ను అభినందించారు.







