UPDATED 1st JUNE 2020MONDAY 7:00 PM
రాజమహేంద్రవరం(రెడ్ బీ న్యూస్): రోడ్ కం రైల్ వంతెన ట్రాక్ ఆధునికీకరణ పనులు పూర్తయ్యాయని ఎంపీ భరత్ రాం తెలిపారు. కొత్తగా నిర్మించిన ట్రాక్‌ను ఆయన సోమవారం పరిశీలించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రోడ్ కం రైలు వంతెనలో ట్రాక్ ఆధునికీకరణ పనులు ఇప్పటికే చాలా వరకు పూర్తయ్యాయని వెల్లడించారు. అలాగే రైలు వంతెనపై ప్రయాణించి పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. లాక్‌డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకొని, 36 గంటల్లో రైల్వేశాఖ వీటిని పూర్తి చేశారన్నారు. 1977 తర్వాత గోదావరి నదిపై రైలు ట్రాక్ పూర్తిస్థాయి ఆధునికీకరణ పనులు చేయడం ఇదే తొలిసారి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మాజీ శాసనసభ్యులు డాక్టర్ ఆకుల సత్యనారాయణ, స్థానిక నాయకులు బొమ్మన రాజకుమార్, కానుబోయిన సాగర్, పోలు విజయలక్ష్మి, రైల్వే ఇంజనీరింగ్ అధికారులు వెంకటేశ్వరరావు, నాగేంద్ర ప్రసాద్, రవికిషోర్, గౌతమ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.







