11 న ఆదిత్యలో క్యాంపస్ డ్రైవ్

UPDATED 9th SEPTEMBER 2017 SATURDAY 7:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల క్యాంపస్ లో ఈ నెల 11 న ప్రముఖ సంస్థ ఐ.బి.హబ్ ఇంటర్న్ షిప్ కోసం క్యాంపస్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు సంస్థ వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఆదిత్యలో చదువుతున్న2018 బ్యాచ్ ఫైనల్ ఇయర్ ఈఈఈ, ఈసీఈ, సి ఎస్ ఈ, ఐటి బ్రాంచ్ లకు చెంది, ఎటువంటి బ్యాక్ లాగ్ లేకుండా 65 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ అవకాశం వినియోగించుకోవాలన్నారు. అభ్యర్థులను టెక్నికల్ టెస్ట్-1, టెక్నికల్ టెస్ట్-2, స్కైప్ ఇంటర్వ్యూ ప్రక్రియల ద్వారా ఎంపిక చేయడం జరుగుతుందని, ఎంపికైన వారు హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ డెవలపర్ గా పనిచేయవలసి ఉంటుందన్నారు. ఎంపికైన వారికి ట్రైనింగ్ పీరియడ్ లో నెలకు రూ. 25 వేలు, భోజన, వసతి సౌకర్యాలు, అనంతరం రూ. ఆరు లక్షలు వార్షిక వేతనం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్స్ ప్రొఫెసర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ టి.కె.రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, ప్లేస్ మెంట్ విభాగం సిబ్బంది పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us