అంగన్ వాడీ ఆయా పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ

UPDATED 4th MAY 2018 FRIDAY 9:00 PM

సామర్లకోట: సామర్లకోట పట్టణ పరిధిలో ఆర్బన్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని పాత్రుల పేట, పెన్షన్ లైన్, శెట్టిబలిజ పేట, కొత్తపేటలలో నాలుగు అంగన్ వాడీ ఆయా పోస్టులకు దరఖాస్తులను ఈనెల ఐదు నుంచి 12వతేదీ వరకు స్వీకరించనన్నట్లు సిడిపివో టి.డి.ఆర్. పద్మావతి పేర్కొన్నారు. అలాగే రూరల్ ప్రాజెక్టు పరిధిలో అచ్చంపేట, పెదబ్రహ్మదేవం, వేట్లపాలెంలోని రెండు అంగన్ వాడీ కేంద్రాలకు మొత్తం నాలుగు ఆయా పోస్టులకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు రూరల్ ప్రా జెక్టు ఇన్ చార్జి సిడిపివో పద్మావతి చెప్పారు. 20 సంవత్సరాలు పూర్తి అయి 35 ఏళ్లలోపు గల మహిళలు పదో తరగతి ఉత్తీర్ణులైన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనేందుకు అర్హులని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకొన్న వారు రశీదు పొందాలని, ఇంటర్వ్యూలను ఈ నెల 11న ఉన్నతాధికారుల సమక్షంలో నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us