ఉచిత నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన

UPDATED 29th AUGUST 2019 THURSDAY 9:00 PM

సామర్లకోట (రెడ్ బీ న్యూస్) : స్థానిక అయోధ్యరామపురంలో గల బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. పాఠశాల పూర్వ విద్యార్థులు ఆధ్వర్యంలో శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి (కాకినాడ) సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని సామర్లకోట మున్సిపల్ కమీషనర్ ఎం. ఏసుబాబు ప్రారంభించారు. ఈ శిబిరంలో సుమారు 480 విద్యార్థులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, 68 మంది విద్యార్థులను కళ్లజోళ్లు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిఈ డి ఇ రామారావు, పాఠశాల హెచ్ఎం తోటకూర సాయిరామకృష్ణ, గుమ్మడి రమణ, మడగల శ్యామ్, వైద్యులు డాక్టర్ అంజలి, స్వరూప్, తదితరులు పాల్గొన్నారు. 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us