మరిడమ్మ ఆలయంలో భక్తులు రద్దీ

UPDATED 7th JULY 2019 SUNDAY 9:00 PM

పెద్దాపురం: పెద్దాపురం పట్టణంలో వేంచేసిఉన్న మరిడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు సందర్భంగా మొదటి ఆదివారం అమ్మవారిని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ఉదయం నుంచి అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ కె. విజయలక్ష్మి, దేవస్థానం సిబ్బంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగగకుండా విస్తృత ఏర్పాట్లు చేశారు. దేవాలయ వంశపారంపర్య ధర్మకర్త డాక్టర్‌ చింతపల్లి బ్రహ్మాజీ, ధర్మకర్తల మండలి సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us