ఆదిత్యను సందర్శించిన టిసిఎస్ కంపెనీ ప్రతినిధులు

UPDATED 14th MARCH 2020 SATURDAY 6:30 PM

గండేపల్లి(రెడ్ బీ న్యూస్): గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణాన్ని హైదరాబాదుకు చెందిన టిసిఎస్ కంపెనీకు చెందిన ఏపి, తెలంగాణ క్యాంపస్ హెడ్ అభిరాం కృష్ణ, దినేష్  సుభాష్ పురోహిత్ లు సందర్శించారు. ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి, క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి వారికి సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపక సిబ్బందితో వారు సమావేశమై మాట్లాడారు. బిటెక్ విద్యతో పాటు విద్యార్థులు  కనీసం నాలుగు సర్టిఫికేషన్ కోర్సులు నేర్చుకోవాలని, అలాగే ఆంగ్లంలో నైపుణ్యం సాధించి కమ్యూనికేషన్ స్కిల్స్ అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. అధ్యాపకులు కూడా ఎప్పటికప్పుడు ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ విద్యార్థులను సరైన మార్గనిర్దేశం చేయాలని అన్నారు. ఈ సందర్భంగా టిసిఎస్ లో గల ఉద్యోగ అవకాశాలను గురించి వారు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, డాక్టర్ ఆదిరెడ్డి రమేష్, డీన్స్, వివిధ విభాగాధిపతులు, ప్లేస్ మెంట్ విభాగం అధికారి పి. అనిల్, అధ్యాపక సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us