న్యూయార్క్ (రెడ్ బీ న్యూస్) 20 డిసెంవేర్ 2021: భీకర ప్రమాదాల నుంచి త్రుటిలో తప్పించుకోవడం సాధారణంగా సినిమాల్లోనే చూస్తుంటాం. కానీ అసాధారణ రీతిలో ఓ అక్క, తమ్ముడు అగ్నిప్రమాదం నుంచి ప్రాణాలను కాపాడుకున్న ఘటన న్యూయార్క్‌లో జరిగింది. ఈస్ట్ విలేజ్ లోని జాకబ్ రియిస్ భవనంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. నాల్గవ అంతస్తులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అన్ని వైపుల నుంచి మంటలు చుట్టుముట్టిన స్థితిలో అక్కాతమ్ముళ్లు ఆ భవనం కిటికీ ద్వారా బయటపడేందుకు యత్నించారు. ప్రమాదకర స్థితిలో కిటికీకి వెలాడుతూ.. పక్కనే ఉన్న పైపును పట్టుకున్నారు. క్షేమంగా కిందకు దిగారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. సహాయం కోసం ఎదురుచూడకుండా.. చాకచక్యంగా బయటపడ్డ ఆ అక్కాతమ్ముళ్లను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. వారు నిజమైన హీరోలంటూ కొనియాడుతున్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







