UPDATED 26th FEBRUARY 2018 MONDAY 7:00 PM
సామర్లకోట: మద్యం మత్తులో ఒక వ్యక్తి సీసాతో తలపై కొట్టడంతో అతడు తీవ్రంగా గాయపడిన సంఘటన పట్టణంలో జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం స్థానిక బళ్ళ మార్కెట్ సెంటర్‌లో మద్యం మత్తులో ఉన్న జి. వీర్రాజు సీసాతో ఎం. నాగరాజును కొట్టాడన్నారు. స్థానికులు వెంటనే అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.







