ఘనంగా ప్రారంభమైన పోతురాజుబాబు జాతర మహోత్సవాలు

UPDATED 22nd APRIL 2018 SUNDAY 10:00 PM

గంగవరం: తూర్పుగోదావరి జిల్లా గంగవరంలో వేంచేసివున్న పోతురాజుబాబు జాతర మహోత్సవాలు ఆదివారం రాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన గరగల నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. స్వామి వారిని గ్రామవీధుల్లో ఊరేగించారు. దీనిలో భాగంగా మహిళలు పసుపునీళ్లతో స్వామివారికి స్వాగతం పలికారు. ఐదురోజులు పాటు నిర్వహించే ఈ జాతర మహోత్సవాలలో భాగంగా పలు సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుని కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వై.ఆర్.కె. ప్రసాద్, ప్రభాకర్, బాబీ, శేషాచార్యులు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us