UPDATED 25th JANUARY 2020 SATURDAY 9:00 PM
సామర్లకోట(రెడ్ బీ న్యూస్): విద్యార్థి దశ నుంచి ఓటు హక్కు ప్రాధాన్యతను తెలుసుకొని సుస్థిర ప్రజాస్వామ్య వ్యవస్థ రూపకల్పనలో యువత పాలుపంచుకోవాలని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత తోటకూర సాయిరామకృష్ణ పేర్కొన్నారు. స్థానిక బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నతపాఠశాలలో జాతీయ ఓటరు దినో త్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎం సాయిరామకృష్ణ మాట్లాడుతూ ఓటు మనిషి తలరాతను మార్చి దేశ భవిష్యత్‌ను నిలబెట్టే ఆయుధమని, 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరూ విధిగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు.







