* సమాచారశాఖ డిప్యూటీ డైరెక్టర్ యం.ఫ్రాన్సిస్
UPDATED 29th JULY 2019 MONDAY 6:00 PM
పెద్దాపురం: 2019-20 సంవత్సరానికి పెద్దాపురం డివిజన్ పరిధిలోని అక్రిడేటెడ్ జర్నలిస్టులు వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ద్వారా హెల్త్ కార్డు పొందడానికి ఆగస్టు నెల 13వ తేదీలోగా ప్రీమియం రూ.1250/- చెల్లించాలని సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ యం. ఫ్రాన్సిస్ ఒక ప్రకటనలో తెలిపారు. సిఎఫ్ఎమ్ఎఎస్ పిడి చలానా ద్వారా Major Head:8342-Other Deposits, Minor Head:120-Misc. Deposits, Sub-Head: 12 Working Journalists Health Scheme, 004- Journalists కాంట్రిబ్యూషన్ (DDO Code No: 2703-0802-003) ఈ మొత్తాన్ని వచ్చేనెల 13వ తేదీలోగా చెల్లించి, ఆ చలానా ఒరిజినల్, అక్రిడేషన్ కార్డు, పాత హెల్త్ కార్డు నకళ్ళను జతపరిచి సమాచార పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయంలో గానీ, పెద్దాపురం డివిజినల్ పౌర సంబంధాధికారి కార్యాలయంలో గానీ అందజేయాలని కోరారు. కొత్తగా హెల్త్ కార్డు తీసుకునే అక్రిడేటెడ్ జర్నలిస్టులు చలానా ఒరిజినల్, అక్రెడిషన్ కార్డు నకలుతో కలిపి తమ కుటుంబ సభ్యుల ఫోటోలు, ఆధార్ కార్డులను జెపిజి ఫార్మాట్ లో(200 కెబి కన్నా తక్కువ)తో కలిపి జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయం (కాకినాడ)లో అందజేయాలని ఆయన తెలిపారు.







