UPDATED 1st OCTOBER 2019 TUESDAY 9:00 PM
పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): పెద్దాపురంలోని మారుతీ పౌల్ట్రీ వెనుక గల పొలాల్లో అనధికారికంగా బాణాసంచా తయారు చేస్తున్నారన్న ఫిర్యాదు మేరకు బాణాసంచా తయారీ కేంద్రంపై అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 10 కిలోల మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని అన్నారు. అనంతరం వారిని పోలీస్‌స్టేషన్‌కు అప్పగించామని, వారిపై ఎస్‌ఐ సురేష్ కేసు నమోదు చేసినట్లు పెద్దాపురం అగ్నిమాపకాధికారి బంగారపు ఏసుబాబు తెలిపారు.







