గంగవరం (రెడ్ బీ న్యూస్) 9 డిసెంబర్ 2021: మండలంలోని ఎండపల్లి, మరిపాలెం పంచాయతీల్లో టీడీపీ మండల కమిటీ అధ్యక్షుడు పాము అర్జున ఆధ్వర్యంలో గౌరవ సభ కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఈ సమావేశంలో చర్చించారు. ప్రభుత్వం వన్ టైం సెటిల్మెంట్ పేరుతో ప్రజల డబ్బులు దోచుకునేందుకు ప్రయత్నిస్తోందన్నారు. నిత్యవసర వస్తువులు ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని, అర్హులైన వారికి సామాజిక పింఛన్లు అందడం లేదని, గ్రామాల్లో కనీసం వీధి దీపాలు వెలగడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కనిగిరి రాంబాబు, మాజీ ఎంపీపీ డాక్టర్ తీగల ప్రభ, ఎంపీటీసీ సభ్యుడు ఆదినారాయణ, టీడీపీ నాయకులు వెంకట్ రెడ్డి, భాను ప్రకాష్, బద్రి సీతమ్మ, నరసన్న దొర, సత్యనారాయణ, సత్యవేణి, రామారావు, బాలు దొర తదితరులు పాల్గొన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







