UPDATED 17th SEPTEMBER 2019 TUESDAY 8:00 PM
సామర్లకోట(రెడ్ బీ న్యూస్): వివాహేతర సంబంధం ఒక వ్యక్తిపై హత్యాయత్నానికి దారితీసిన సంఘటన సామర్లకోట మండలం పెదబ్రహ్మదేవం గ్రామంలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. సామర్లకోట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కర్రి శ్రీను (34) అనే వ్యక్తి లక్ష్మీనర్సాపురంలో గల ఒక రైసుమిల్లులో పనిచేస్తున్నాడు. వెలుగు గోపాలస్వామి అనే వ్యక్తి శ్రీనును మద్యం సేవించేందుకని సమీపంలోని పొలాల్లోకి తీసుకుని వెళ్లి అక్కడ గోపాలస్వామి శ్రీనుపై చాకుతో దాడి చేసి గొంతుకోసి పరారయ్యాడు. ఉదయం వరకు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న శ్రీనును స్థానికులు గమనించి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గోపాలస్వామి కజిన్ సిస్టర్ తో శ్రీనుకు వివాహేతర సంబంధం ఉందని, దానిపై గోపాలస్వామి శ్రీనుకు మధ్య గొడవలు జరిగినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. శ్రీను భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సామర్లకోట ఎస్ఐ సుమంత్ తెలిపారు.







