UPDATED 26th AUGUST 2018 SUNDAY 9:00 PM
సామర్లకోట: తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మప్రచార పరిషత్, దేవాదాయ శాఖలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మనగుడి కార్యక్రమాలు ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా స్థానిక పంచారామక్షేత్రమైన శ్రీ కుమారరామ భీమేశ్వరస్వామి వారి ఆలయంలో శ్రావణ శుద్ధ పౌర్ణమి రక్షాబంధన్ పర్వదినం పురస్కరించుకుని స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, తదితర పూజలు ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి, అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కార్య నిర్వహణాధికారి పులి నారాయణమూర్తి, ధర్మకర్తల మండలి సభ్యులు, వేద పండితులు తదితరులు పాల్గొన్నారు.







