ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచుకోవాలి

* పెద్దాపురం డిఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు  

UPDATED 24th JANUARY 2020 FRIDAY 9:00 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్): ట్రాఫిక్ నియమ, నిబంధనలపై విద్యార్థి దశ నుంచి అవగాహన పెంపొందించుకోవాలని పెద్దాపురం డిఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు పేర్కొన్నారు. రహదారి భద్రతా వారోత్సవాలలో భాగంగా స్థానిక వై.ఆర్.ఎల్ డిగ్రీ కళాశాలలో రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ నిబంధనలపై శుక్రవారం అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడంతోనే అధిక శాతం మంది ప్రమాదాల బారిన పడుతున్నారని, ప్రతీ ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అన్నారు. విద్యార్థులు రోడ్డుపై జరిగే ప్రమాదాలు గురించి తల్లిదండ్రులు, చుట్టుపక్కల గల ప్రజలకు తెలియచేసి వారిలో చైతన్యం కలుగచేయాలని తెలిపారు. ప్రతీ వ్యక్తి రోడ్డుపై ప్రయాణం చేసేటప్పుడు తప్పకుండా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని, ట్రిపుల్ రైడింగ్, ఓవర్ స్పీడ్, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపరాదని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఎండి వై. రవిచంద్, పెద్దాపురం సిఐ వి. శ్రీనివాస్, సామర్లకోట ఎస్ఐ సుమంత్, ప్రిన్సిపాల్ లావణ్య, విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us