అమ్మవారికి ప్రత్యేక పూజలు

UPDATED 20th JULY 2018 FRIDAY 9:00 PM 

సామర్లకోట: స్థానిక శ్రీ కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయంలో మహిషాసురమర్ధిని అమ్మవారికి శుక్రవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. అమ్మవారిని వివిధ రకాల పుష్పాలు, వస్త్రాలతో విశేషంగా అలంకరించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ కుమారారామ భీమేశ్వరస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ కంటే జగదీష్ మోహన్(బాబు), సభ్యులు మహంకాళి వెంకటగణేష్, పడాల వీరబాబు, వేదపండితులు వేమూరి సోమేశ్వర శర్మ, భమిడిపాటి శ్రీనివాసశర్మ, ఆలయ కార్యనిర్వహణాధికారి పులి నారాయణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us