నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ

UPDATED 27th DECEMBER 2018 THURSDAY 7:00 PM 

గండేపల్లి: చలికాలంలో రహదారులపై నిద్రించే వారికి ఆదిత్య డిగ్రీ కళాశాల ఫోరెన్సిక్ సైన్స్ విద్యార్థులు దుప్పట్లు అందజేసి మానవత్వం చాటుకున్నారు. మానవ సేవయే మాధవ సేవ అనే గొప్ప ఉద్దేశంతో కాకినాడ, రాజమహేంద్రవరం, సామర్లకోట, పెద్దాపురం, తదితర ప్రాంతాల్లో ప్లాట్‌ఫాంలపై నిద్రిస్తున్న వృద్ధులు, భిక్షగాళ్లు తదితరులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి, ప్రిన్సిపాల్ ఇ. మోహన్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆస్థాశర్మ, తదితరులు విద్యార్థులను అభినందించారు.   
 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us