నిరుద్యోగ యువతకు మార్కెటింగ్ పై శిక్షణ

UPDATED 24th JULY 2020 FRIDAY 6:00 PM

రంపచోడవరం(రెడ్ బీ న్యూస్): ఇంజనీరింగ్, డిగ్రీ చదివిన విద్యార్ధులు, నిరుద్యోగ యువతకు ఆన్ లైన్ ద్వారా మార్కెటింగ్ పై శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చర్యలు తీసుకున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి టి. శివప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ఇంజనీరింగ్, డిగ్రీ చదివిన యువతకు ఆన్‌లైన్ శిక్షణ ఇచ్చేందుకు ఈలెర్న్ ఓక్ ఇండియా సంస్థ ముందుకు వచ్చిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఎండి, సిఇవో డాక్టర్ అర్జా శ్రీకాంత్ సమక్షంలో కార్యనిర్వాహక సంచాలకులు హనుమనాయక్, ఈలెర్న్ ఓక్ ఇండియా సంస్థ చైర్మన్ అరవింద అరసవిల్లి, సిఇవో సౌజన్య ఈమేరకు ఒప్పందం జరిగినట్లు తెలిపారు. ఈ ఒప్పందంలో భాగంగా ఇంజనీరింగ్, డిగ్రీ పూర్తి చేసిన యువతకు ఆన్ లైన్ ద్వారా డిజిటల్ మార్కెటింగ్, ఐఈఎల్టీఎస్ డవలప్ యాప్స్ డాటా సైన్సు తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ ఒప్పందంలో భాగంగా మొదటి విడతగా తూర్పుగోదావరి జిల్లాలో 1500 మందికి శిక్షణ ఇచ్చేందుకు లక్ష్యంగా నిర్దేశించారన్నారు. ఈ అవకాశాన్ని ఆసక్తి గల విద్యార్థులు, నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. పూర్తి వివరాలు కొరకు www.apssdc.in వెబ్ సైట్, లేదా 1800-425-2422 టోల్ ఫ్రీ నెంబరులో సంప్రదించాలని ఆయన కోరారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us