ఆదిత్యలో లెర్న్ టు ఇన్నోవేట్ వర్క్ షాప్ ప్రారంభం

UPDATED 26th JUNE 2018 TUESDAY 9:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ లో లెర్న్ టు ఇన్నోవేట్ పేరిట ఇన్నోవి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వర్క్ షాప్ మంగళవారం ప్రారంభించారు. ఈ నెల 26,27,28తేదీలలో నిర్వహించు ఈ వర్క్ షాప్ ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్, మాజీ ఎమ్మెల్యే, ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషరెడ్డి, ప్రోగ్రాం సీనియర్ అడ్వైజర్ సీమాకుమార్, ఇన్నోవేట్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ వ్యవస్థాపకురాలు దివ్య వడ్లపూడి, ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ మారుతున్న అవసరాలకు అనుగుణంగా యువత తమ నైపుణ్యాలను పెంచుకొని అభివృద్ధి పధంలో పయనించాలని, వారిలో ఉన్న సృజనాత్మక శక్తిని ద్విగుణీకృతం చేసి నేటి పోటీ ప్రపంచంలో ముందుకు వెళ్లేందుకు ఇటువంటి వర్క్ షాపులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యువజన సర్వీసుల శాఖ, ఆపర్ట్స్ అమెరికా, టర్కీలీ ఇన్నోవేషన్ ఇండెక్స్ ల సహకారంతో ఆదిత్య విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం విజయవంతం కావాలని అన్నారు. ఎంపి మురళీమోహన్ మాట్లాడుతూ నేడు విజ్ఞానపరంగా ఎంతో ప్రగతి సాధించామని, ఇంటర్నెట్ సహకారంతో ప్రపంచ నలుమూలల సమాచారం నిమిషాల వ్యవధిలో తెలుసుకుంటున్నామని అన్నారు. నేడు ఏ సమాచారమైనా తెలుసుకొని మరింతగా అవగతం చేసుకొనే అనేక సాధనాలు ఉన్నాయని అన్నారు. మహిళ అంటే వంటింటి కుందేలు కాదని, పిల్లలు కనే యంత్రాలుగా చూడరాదని, నేడు పురుషులతో సమానంగా స్త్రీలు కూడా అన్ని రంగాలలో దూసుకుపోతున్నారని అన్నారు. తెలివైన యువత  తమ సృజనాత్మక శక్తితో పరిశ్రమలు స్థాపించి పదిమందికి ఉపాధి కల్పించే దిశగా ఆలోచించాలని అన్నారు. ఆదిత్య విద్యా సంస్థ చైర్మన్ శేషారెడ్డి మాట్లాడుతూ మురళీమోహన్ రియల్ హీరో అని, చిన్నస్థాయి నుంచి కృషి పట్టుదలతో నేడు ఈ స్థాయికి చేరుకున్నారని, అలాగే విద్యార్థులు ఒక గోల్ ఏర్పరుచుని దానిని సాధించడానికి నిరంతరం కృషి చేయాలన్నారు. విద్యార్థులలో సృజనాత్మక శక్తిని పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన సేవల శాఖ సహకారంతో ఈ కార్యశాల నిర్వహించడం జరుగుతోందని, ఇంజనీరింగ్, డిగ్రీ చదువుతున్న విద్యార్థులే కాక నిరుద్యోగ యువత కూడా మూడు వేలమంది ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్స్ పంపారని, వారిలో 180మందిని ఈ వర్క్ షాప్ కు ఎంపిక చేసి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. అనంతరం అతిథులను ఆదిత్య యాజమాన్యం దుశ్శాలువా జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ కళాశాలల ప్రిన్సిపాల్స్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us