UPDATED 26TH AUGUST 2018 SUNDAY 9:00 PM
సామర్లకోట: స్థానిక లయన్స్ క్లబ్ ప్రతినిధి చిత్తులూరి వీర్రాజు తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నిరుపేదలకు ఆదివారం దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం లయన్స్ క్లబ్ సభ్యులు చిత్తులూరి వీర్రాజును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు నేతి బాబ్జీ, గుండు శంకర్రావు, ఈశ్వరకుమార్, మేకా శ్రీను, కటకం గంగబాబు, సేపేని సురేష్, కర్రి ఆదినారాయణరెడ్డి, చిత్తులూరి శ్రీదేవి, కంచర్ల సుబ్రహ్మణ్యం, మద్దిరాల శివ నాగకృష్ణ, కానుబోయిన విజయకృష్ణ, రాజ్ ఫుట్ సింగ్, అమలకంటి శ్రీను, తదితరులు పాల్గొన్నారు.







