విధుల్లో అలసత్వం వహించే అధికారులపై జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు

* ఎన్టీఆర్ హోసింగ్ లక్ష్యాలు సకాలంలో పూర్తిచేయాలి 
* క్రిస్టియన్స్ ను హోసింగ్ పథకంలో చేర్చాలి
* ఆర్డీవో వసంతరాయుడు
UPDATED 26th JUNE 2018 TUESDAY 9:00 PM
పెద్దాపురం: విధుల్లో అలసత్వం వహించే అధికారులు, సిబ్బందిపై జిల్లా కలెక్టరు దృష్టికి తీసుకురావడం జరుగుతుందని, ఎన్టీఆర్ హోసింగ్ సంబంధించిన లక్ష్యాలను ఈనెలాఖరులోగా పూర్తి చేయాలని ఆర్డీవో ఎన్.ఎస్.వి.బి. వసంతరాయుడు అధికారులను ఆదేశించారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో హోసింగ్ స్కీంపై రంగంపేట, పెద్దాపురం అర్బన్, రూరల్ కు సంబంధించిన అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ వివిధ శాఖల అధికారుల సమన్వయంతో వారికి కేటాయించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని, అలాగే క్రిస్టియన్స్ ను హౌసింగు పథకంలో చేర్పించాలని అన్నారు. డివిజన్లోని చాలా ప్రాంతాల్లో హౌసింగు వెనుకబడి ఉందని, గృహనిర్మాణాలు పురోగతిని వేగవంతం చేయాలన్నారు. అదేవిధంగా వ్యక్తిగత మరుగుదొడ్లు, ఎస్సీ, బిసి, కాపు కార్పోరేషన్  ద్వారా అందిస్తున్న రుణాల ప్రగతిని సమీక్షించారు. అలాగే ఆదరణ పథకం సంబంధించి  టివిలో ప్రచారం చేయించాలని తెలిపారు. రైతులకు రుణాలు ఇవ్వడంలో పిర్యాదులు వస్తున్నాయని, వాటిని కూడ సత్వరమే పరిష్కరించాలని వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతీ గ్రామంలో నూరుశాతం సిసి రోడ్లు, గ్రామపంచాయతీ, అంగన్వాడీ భవనాలు, స్కూలు ప్రహారీగోడలు సంబంధిత పనులపై సంబంధిత అధికారులతో సమీక్షించి త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభానికి సిద్దంకావాలన్నారు. బ్యాంకు రుణాలు  మంజూరులో సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. జిల్లా కలెక్టరు ఆదేశాల మేరకు అన్నిశాఖల అధికారులు, సిబ్బంది వారికి కేటాయించిన విధుల్లో అలసత్వం వహించకుండా పనులు పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హౌసింగు ఇఇ సుధాకర్ పట్నాయిక్, పెద్దాపురం మున్సిపల్ కమీషనర్ బి.ఆర్. శేషాద్రి, ఎంపిడివోలు కిషోర్, వసంతమాధవి, తహశీల్దార్లు, బాలసుబ్రహ్మణ్యం, కృష్ణమూర్తి, వ్యవసాయశాఖ ఏడిఎ ఎం. రత్నప్రశాంతి, ఉద్యానవన శాఖ అధికారి సిరిల్, హౌసింగు డిఇ సి.హెచ్. వేణుగోపాలస్వామి, హౌసింగు ఎఇలు, ఎపివోలు, పీల్డ్ అసిస్టెంట్లు, వర్క్ఇనస్పెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us