ఆర్టికల్‌ 370 రద్దు చరిత్రాత్మకం

* బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి తుమ్మల పద్మజ

UPDATED 8th AUGUST 2019 THURSDAY 7:00 PM

పెద్దాపురం: జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370ని రద్దు చేయడం చరిత్రాత్మకమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తుమ్మల పద్మజ అన్నారు. స్థానిక వేంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో గల సత్యసాయి మందిరంలో గురువారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా సమస్యాత్మకంగా మారిన ఈ చట్టాన్ని రద్దు చేసేందుకు ప్రధాని మోడీ  నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుందని, ఫలితంగా అక్కడి ప్రజలకు పూర్తి స్వేచ్ఛ లభించినట్లు అయిందని అన్నారు. ఎన్నికల సమయంలో వాగ్దానం చేసినట్లుగానే మోదీ, అమిత్‌షా కీలకమైన నిర్ణయం తీసుకొని 370, 35 (ఎ) చట్టాలను రద్దు చేశారని చెప్పారు. కొంత మంది కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వ  నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని, ప్రజలే వీరికి తగిన బుద్ధి చెప్తారన్నారు. భారత రాజ్యాంగంలోని 370, 35ఏ అధికరణాలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం అత్యంత సాహసోపేత నిర్ణయం తీసుకుందని, ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్‌షా అత్యంత సాహసం ప్రదర్శించి, వ్యూహాత్మకంగా జమ్ము, కశ్మీర్‌ను రెండు జెండాల నుంచి తప్పించారని, దేశ విభజన సమయంలో చోటు చేసుకున్న లోపాలను సవరించారని అన్నారు. 70 ఏళ్లుగా పేదరికంలో మగ్గిపోతూ ఉగ్రవాదం వైపు మళ్లుతున్న కశ్మీరీ యువతను భారత్‌లో అంతర్భాగంగా మమేకం చేశారని కొనియాడారు. జమ్ము, కశ్మీర్‌, లడక్ ప్రాంతాలు ఇక శరవేగంగా అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. ఆర్టికల్‌ 370 రద్దును వ్యతిరేకించిన కొన్ని పార్టీల నేతలు అభాసుపాలయ్యారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వర్గాల ప్రజలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఈ విషయంలో ప్రశంసిస్తున్నారని, మోడీ పాలనపై దేశ ప్రజలంతా పూర్తి విశ్వాసంతో ఉన్నారని పార్లమెంట్ ఇన్ ఛార్జ్ తోట సర్వారాయుడు అన్నారు. ముందుగా విదేశాంగ శాఖా మంత్రి సుష్మాస్వరాజ్ మృతికి సంతాపం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ జిల్లా కమిటీ సభ్యుడు పైడిపల్లి సూర్యనారాయణ మూర్తి (చిన్ని), రాష్ట్ర కమిటీ సభ్యుడు ఖండవల్లి సూర్యనారాయణ, బొండాడ చిట్టిబాబు, తదితరులు పాల్గొన్నారు.       

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us