UPDATED 12th JANUARY 2018 FRIDAY 5:30 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల క్యాంపస్ లో స్వామి వివేకానంద 155వ జయంతిని పురస్కరించుకుని యువజన దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్ హాజరై వివేకానందుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో యువత పాత్ర ఎంతో కీలకమని, యువత దుర్వ్యసనాలకు దూరంగా ఉండాలని, వివేకానందుని ఆదర్శంగా తీసుకుని సన్మార్గంలో పయనించి ఉన్నత స్థాయికి చేరుకొని భావితరాలకు ఆదర్శంగా నిలవాలన్నారు. ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల ఎన్.ఎస్.ఎస్ విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులకు స్వామి వివేకానంద జీవిత విశేషాలపై వకృత్వ, వ్యాసరచన పోటీలు నిర్వహించి, విజేతలకు జ్ఞాపిక, ప్రశంసాపత్రాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రామ్ అధికారి జె. బాలమోహన్ రాజు, ఎం. సోమిరెడ్డి, ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.







