UPDATED 3rd APRIL 2018 TUESDAY 9:00 PM
సామర్లకోట: తోట గోపాలకృష్ణ మున్సిపల్ హైస్కూల్లో పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేస్తూ స్థానిక 15వ వార్డు మాజీ కౌన్సిలర్ నేతల హరిబాబు మంగళవారం మున్సిపల్ కమిషనర్ సి.హెచ్. వెంకటేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15వ వార్డులోని తోట గోపాలకృష్ణ మున్సిపల్ హైస్కూల్లో విద్యార్థుల సంఖ్య సుమారు 250 మంది వరకు ఉన్నా ఇంగ్లీష్ టీచర్ లేక విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులను నియమించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్.వి. లక్ష్మి, రొట్ట అబ్బులు, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.







