పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యం

* జిల్లా పరిషత్ సీఈవో సత్యనారాయణ

UPDATED 9th DECEMBER 2020 WEDNESDAY 6:00 PM

పెద్దాపురం (రెడ్ బీ న్యూస్): ప్రజలందరి భాగస్వామ్యంతో పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించేందుకు వ్యర్ధాలపై యుద్ధం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా పరిషత్ సీఈవో ఎన్.వి.వి. సత్యనారాయణ అన్నారు. మనం-మన పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 7 నుంచి 21వ తేదీ వరకు చేపట్టిన వ్యర్థాలపై యుద్ధం పక్షోత్సవాలల్లో భాగంగా మండల పరిధిలోని జి. రాగంపేట గ్రామంలో గల రైతు భరోసా కేంద్రం వద్ద బుధవారం అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీవో అబ్బిరెడ్డి రమణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈవో ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ మనిషి జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే పరిశుభ్రత తప్పక పాటించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా వ్యాధులకు దూరంగా ఉండవచ్చని అన్నారు. మనం రోజూ వారీ సేకరించిన చెత్తను తడి, పొడి చెత్తగా వేరు చేసే విధానంపై ప్రతీ ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. గ్రామంలో ప్రతీ ఇంటికి రోజుకు రూ.2 చొప్పున నెలకు రూ.60 చెల్లించడం ద్వారా వ్యర్ధాలు సేకరించే సిబ్బందికి మరింత బాధ్యత పెరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతీ కార్యక్రమంలోను ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ఆ కార్యక్రమం ఎంతో విజయవంతం అవుతుందని అన్నారు. జిల్లాలో జి.రాగంపేట గ్రామం పరిశుభ్రత పాటించే గ్రామాల్లో ముందజలో ఉందని, జిల్లాలో ఉన్న 1144 పంచాయతీల్లో జి. రాగంపేట పంచాయతీ ప్రథమ స్థానంలో ఉండాలని ఆకాంక్షిస్తున్నానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి ముందు రాజమండ్రికి చెందిన రాజ్ కుమార్ బృందంచే పరిశుభ్రతపై బుర్రకధ కళారూపం ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. అనంతరం గ్రామంలో భారీ ర్యాలీ చేపట్టి ప్రతిజ్ఞ  చేశారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ పంచాయతీ అధికారిణి అమ్మాజీ, డిపిఆర్సీ కోఆర్డినేటర్ ఆర్మ్ స్ట్రాంగ్, డివిజనల్ అభివృద్ధి అధికారి ప్రసాద్, సీడీపీవో పంతం సావిత్రి, ఈవోపీఆర్డీ కరక హిమ మహేశ్వరి, పంచాయతీ కార్యదర్శి సెలెట్ రాజు, తదితరులు పాల్గొన్నారు.

    

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us