సబ్సిడీపై రైతులకు విత్తనాలు అందజేత

సామర్లకోట: 8 జూన్ 2020 (రెడ్ బీ న్యూస్): రైతులు ఎవరికి వారే సబ్సిడీ విత్తనాలను పొంది విత్తన శుద్ధిని సక్రమమైన పద్ధతిలో చేసుకుంటే అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉందని ఏడీఏ పద్మశ్రీ అన్నారు. సామర్లకోట మండలం గొంచాల గ్రామంలో రైతు భరోసా కేంద్రంలో రైతులకు రూ.5 కే కిలో వరి విత్తనాలను సబ్సిడీ ధరలకు అందించే కార్యక్రమాన్ని సోమవారం ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తొలకరిలో వరి సాగుకు సన్నద్ధమవుతున్న రైతులు వ్యవసాయ అధికారులు సూచించిన విధంగా విత్తన శుద్ధిని చేసుకోవాలన్నారు. కాకినాడ డివిజన్ పరిధిలో అన్ని మండలాలతో పాటు అన్ని గ్రామాల్లో సబ్సిడీ విత్తనాలను అందిస్తున్నట్లు చెప్పారు. ఇంకా రైతులకు వ్యవసాయ పద్ధతులపై ఆమె పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి ఐ. సత్యనారాయణ, ఎంఈవో సతీష్, విఏఏ అభినయ గ్రామానికి చెందిన పలువురు రైతులు నాయకులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us