UPDATED 12th OCTOBER 2017 THURSDAY 7:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల క్యాంపస్ లో ఈ నెల 14 న ఆర్.జి.బి.ఎస్.ఐ. బహుళ జాతి కార్పొరేషన్ సంస్థచే ఉద్యోగాలకు క్యాంపస్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. తమ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్న 2018 పాస్ అవుట్ స్టూడెంట్స్ 65 శాతం మార్కులతో ఎటువంటి బ్యాక్ లాగ్స్ లేని విద్యార్థులు ఈ డ్రైవ్ లో పాల్గొనవచ్చన్నారు. అలాగే ఈ డ్రైవ్ లో గ్రూప్ డిస్కషన్స్ , టెస్ట్, హెచ్ ఆర్ సాంకేతిక రౌండ్, సీఈవో రౌండ్, మొదలైన వాటి ఆధారంగా ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందన్నారు. డిజైన్ ఇంజనీర్ గా బెంగుళూరు లో వార్షిక వేతనం రూ. 2.50 లక్షలు నుంచి 3.00 లక్షలు లభిస్తుందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ ప్రొఫెసర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ టి.కె రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, ప్లేస్ మెంట్ సిబ్బంది పాల్గొన్నారు.







