గంగవరం (రెడ్ బీ న్యూస్) 11 జనవరి 2022 : రాష్ట్రంలో నిత్యం పెరిగిపోతున్న నిత్యావసర వస్తువులు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి డిమాండ్ చేశారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గంగవరంలో మండల కమిటీ అధ్యక్షుడు పాము అర్జున ఆధ్వర్యంలో జరిగిన ధరలు దిగిరావాలి జగన్ దిగిపోవాలి కార్యక్రమంలో ఆమె మంగళవారం పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మోసగిస్తోందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరిగిపోతుంటే ప్రభుత్వానికి ఏమీ పట్టడం లేదని, సినిమా టికెట్లు ధర తగ్గించడంలో ఉన్న శ్రద్ధ ప్రజల ఇబ్బందులపై లేదన్నారు. అనంతరం కూరగాయలు, గ్యాస్ సిలెండర్ తో గంగవరం వై జంక్షన్ లో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి కనిగిరి రాంబాబు, మాజీ ఎంపీపీలు డాక్టర్ తీగల ప్రభ, శ్రీ రాములు, టీడీపీ నాయకులు కృష్ణ, వెంకట్ రెడ్డి, వెంకటరమణ, అప్పారావు, బద్రి, ప్రసాద్, నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







