UPDATED 11th FEBRUARY 2019 MONDAY 9:00 PM
సామర్లకోట: సామర్లకోట మండల నూతన తహసీల్దారుగా సిహెచ్ నరసింహారావు సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయన కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండల తహసీల్దారుగా పనిచేస్తూ బదిలీపై సామర్లకోటకు వచ్చారు. నూతన తహసీల్దారుగా భాద్యతలు చేపట్టిన నరసింహారావును డిప్యూటీ తహసీల్దార్ ఎన్.వి.ఎస్. ప్రసాద్, రెవిన్యూ ఇనస్పెక్టర్ రాజేష్, ఎంపిడివో కె. స్వప్న, ఎంఇవో వై.వి. శివరామకృష్ణయ్య, వీఆర్వోలు వై. భరత్, ఎం.డి ఖాదర్ వల్లి, పి. శివరావు, గంగాధరరావు, తదితరులు కలుసుకుని శుభాకాంక్షలు తెలియచేశారు.







