వెబ్ గ్రాఫిక్స్ డిజైన్ పై వర్క్ షాప్ ప్రారంభం

UPDATED 16th AUGUST 2019 FRIDAY 6:00 PM

రాజానగరం: గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (గైట్) అటానమస్ కళాశాలలో సిఎస్ఈ విభాగం ఆధ్వర్యంలో యువ ఇంజినీర్లకు రెండురోజుల పాటు యూజర్ ఇంటర్ ఫేస్ వెబ్ అండ్ గ్రాఫిక్స్ డిజైన్ అనే అంశంపై నిర్వహించు వర్క్ షాప్ శుక్రవారం ప్రారంభించినట్లు కళాశాల సిఎస్ఈ విభాగాధిపతి డాక్టర్ బి సుజాత అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం రహదారి సంకేతాల నుంచి పత్రిక, చలనచిత్ర పరిశ్రమ వంటి వివిధ రంగాల్లో గ్రాఫిక్ డిజైన్ కీలకపాత్ర పోషిస్తుందని అన్నారు. వర్క్ షాప్ రిసోర్స్ పర్సన్ గా పాల్గొన్న స్క్వేర్ డ్ సాఫ్ట్ క్రియేటివ్ హెడ్ అహ్మద్ అక్రమ్ మాట్లాడుతూ గ్రాఫిక్ డిజైన్ అనగా టైపోగ్రఫీ, ఫొటోగ్రఫీ, ఇలస్ట్రేషన్ వాడకం ద్వారా దృశ్యమాన కమ్యూనికేషన్ అని అన్నారు. గ్రాఫిక్ డిజైనర్లకు సృజనాత్మకత అవసరమని, సమర్ధవంతమైన గ్రాఫిక్స్ రూపకల్పనకు వ్యూహం ముఖ్యమని తెలిపారు. ఇటీవల నిర్మిస్తున్న పలు చిత్రాల్లో సైతం ఇంటర్నెట్ గ్రాఫిక్స్ చోటు చేసుకుంటున్నాయని, ఈ రంగంలో నైపుణ్యం సాధిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా గ్రాఫిక్ డిజైన్ కు వెబ్ సైట్ రూపొందించి ఇంటర్నెట్ లో అందుబాటులో ఎలా ఉంచాలో ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ టివి ప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. లీలావతి, ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఎం. శ్రీనివాస చక్రవర్తి, ఎం.హెచ్.ఆర్.డి ఇన్నోవేషన్ కౌన్సిల్ సభ్యులు అహ్మద్ ఆలీషా, ప్రేమ్ చంద్, సాయికిరణ్, కీర్తి సహానా, తదితరులు పాల్గొన్నారు.     

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us