Crime News: భార్యపై కిరాతకం.. ఫ్రెండ్స్ తో కలిసి రేప్ చేసి.. సిగరెట్లతో కాల్చి!

★ మహిళపై ఘోరం.. ఐదుగురి అరెస్టు

మధ్యప్రదేశ్ (రెడ్ బీ న్యూస్) 16 జనవరి 2022: ఇండోర్‌లో ఇండోర్: మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఓ వివాహితపై జరిగిన ఘోరం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కట్టుకున్న భర్తే మృగంలా మారి తన స్నేహితులతో కలిసి ఆమెపై అత్యంత కిరాతకానికి ఒడిగట్టాడు. 32 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం చేసి చిత్రహింసలకు గురిచేసిన ఘటనలో ఆమె భర్తతో పాటు మరో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. తన భర్త, అతడి స్నేహితులు అసహజరీతిలో తనపై అత్యాచారం చేసి సిగరెట్లతో రహస్య భాగాల్లో కాల్చి టార్చర్ చేశారని ఆరోపిస్తూ ఆమె ఫిర్యాదు చేసినట్టు పోలీసులు తెలిపారు. లైంగిక దాడిని ప్రతిఘటిస్తే చంపేస్తామని బెదిరించారని ఎఐఆర్‌లో పేర్కొన్నారు. ఇండోర్ లోని షిప్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఫాం హౌస్లో 2019 నవంబర్, 2021 అక్టోబర్ లో ఆమె పై లైంగిక దాడి జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఛత్తీస్ గఢ్ కు చెందిన మహిళ ఇండోర్ కు చెందిన వ్యక్తిని మ్యాట్రిమోనీ సైట్ ద్వారా కలిసి వివాహం చేసుకుందని పోలీసులు వెల్లడించారు. అతడికి అప్పటికే వివాహం అయిందని తెలిపారు. అయితే, ఎలాగో ఆ ఫాం హౌస్ నుంచి తప్పించుకొని ఛత్తీస్ గఢ్ లోని తన తల్లిదండ్రుల ఇంటికి చేరుకున్నప్పటికీ.. నిందితుల్లో ఒకడు తనకు హాని కలిగించే ఉద్దేశంతో అనుసరిస్తుండేవాడని ఫిర్యాదులో పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఆమె భర్తతో పాటు మొత్తం ఐదుగురు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. మధ్యప్రదేశ్, ఛత్తీస్ లో పలు ప్రాంతాల్లో వారందరినీ అరెస్టు చేసినట్టు వెల్లడించారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us