న్యాయసేవా కార్యకర్తల నియామకానికి ధరఖాస్తులు ఆహ్వానం

UPDATED 6th AUGUST 2018 MONDAY 6:30 PM

పెద్దాపురం: రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు పెద్దాపురం కోర్టు పరిధిలో గల పెద్దాపురం, జగ్గంపేట, రంగంపేట, గండేపల్లి మండలాలలో మండల న్యాయసేవాధికార సంస్థ ద్వారా న్యాయసేవా కార్యకర్తల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండల న్యాయసేవాధికార సంస్థ సంఘం చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి కె. రత్న కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు పై మండలాల్లో 25 మందిని ఎంపిక చేసి వారికి ఉచితంగా శిక్షణ ఇస్తామని, శిక్షణ పొందిన అనంతరం ఆయా మండలాల్లో న్యాయసేవా కార్యకర్తలుగా ఏడాదిపాటు పనిచేయడానికి వారికి తగిన గుర్తింపు కార్డులు ఇస్తామన్నారు. న్యాయసేవా కార్యకర్తల నియామకానికి ప్రభుత్వ, ప్రైవేట్, పాఠశాలలు, కళాశాలల ఉపాధ్యాయులు, అధ్యాపకులు, అంగన్వాడీ వర్కర్లు, మండల సమాఖ్య సభ్యులు, వైద్యులు, వివిధ కేంద్ర, రాష్ట్ర ఉన్నతస్థాయి అధికారులు, పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు, పట్టభద్రులు, స్వచ్చంధ సేవా సంస్థల సభ్యులు, డ్వాక్రా గ్రూప్ సభ్యులు, కోఆపరేటివ్ సొసైటీ, ట్రేడ్ యూనియన్ సభ్యులు అర్హులన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు పాస్ పోర్ట్  సైజు ఫొటోలతో రెండు రోజుల్లో పెద్దాపురం కోర్టులోగల మండల న్యాయసేవాధికార సంఘానికి సమర్పించాలని తెలిపారు.      

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us