UPDATED 22nd SEPTEMBER 2018 SATURDAY 7:30 PM
పెద్దాపురం: పర్యావరణ పరిరక్షణకు రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వనం-మనం కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. వనం-మనం కార్యక్రమంలో భాగంగా స్థానిక ఏలేరు ఇరిగేషన్ సర్కిల్ ఆఫీసు ఆవరణలో మంత్రి ఇరిగేషన్ అధికారులతో కలిసి శనివారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా వనం-మనం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టి వాతావరణ కాలుష్యాన్ని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, అన్నారు. ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, వైస్ చైర్మన్ కురిపూరి రాజు, ఇరిగేషన్ ఎస్ఇ టి. కృష్ణారావు, ఆర్దీవో ఎన్.ఎస్.వి.బి. వసంతరాయుడు, ఇరిగేషన్ ఇఇ రాంగోపాల్, డిఇఇ ప్రశాంత్ బాబు, డిప్యూటీ డిఇ శ్యాంప్రసాద్, జెఇ పద్మజ, తహసీల్దార్ జి. బాలసుబ్రహ్మణ్యం, ఇరిగేషన్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.







