కొత్త జేసీ (రెవెన్యూ) సుమిత్‌కుమార్‌

కాకినాడ (రెడ్ బీ న్యూస్) 13 నవంబరు 2021: జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ (రెవెన్యూ)గా సుమిత్‌కుమార్‌గాంధీ నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాకుళం జిల్లా జేసీగా విధులు నిర్వర్తిస్తున్న సుమిత్‌కుమార్‌ జిల్లాకు బదిలీ అయ్యారు. 2019-2020 సంవత్సరాల్లో ఈయన రాజమహేంద్రవరం నగర కార్పొరేషన్‌ కమిషనర్‌గానూ, ఇన్చార్జి సబ్‌కలెక్టర్‌గానూ పనిచేశారు. ఇక ఇక్కడ జేసీగా పనిచేసిన లక్ష్మీశ కొద్దిరోజుల కిందట గ్రేటర్‌ విశాఖ నగరపాలక సంస్థ కమిషనర్‌గా బదిలీపై వెళ్లడంతో ఇప్పటివరకు మరో జేసీగా ఉన్న కీర్తి చేకూరి అదనపు బాధ్యతలు నిర్వర్తించారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us