పనాజీ (రెడ్ బీ న్యూస్) 3 జనవరి 2022 : ముంబయి నుంచి గోవా వెళ్లిన ఓ క్రూజ్ నౌకలో కరోనా కలకలం రేగింది. నౌకలోని సిబ్బంది ఒకరికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో దాదాపు 2వేల మందికి పైగా ప్రయాణికులు గోవా తీరంలోనే చిక్కుకుపోవాల్సి వచ్చింది. ముంబయి పోర్ట్ నుంచి 2016 మంది ప్రయాణికులు, సిబ్బందితో గోవా బయల్దేరిన కార్డెలియా క్రూజ్ నౌకలో సిబ్బంది ఒకరు అనారోగ్యానికి గురయ్యారు. దీంతో నౌకలో వైద్యులు ఆ వ్యక్తికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. యాంటిజెన్ టెస్ట్‌లో పాజిటివ్‌గా తేలినట్లు గోవా ఆరోగ్య మంత్రి విశ్వజిత్ రాణె ఆదివారం వెల్లడించారు. కరోనా సోకినట్లు తేలగానే నౌకను గోవా తీరంలో నిలిపేందుకు అధికారులు అంగీకరించలేదు. దీంతో మోర్ముగావ్ తీరంలో నిలిపారు. అప్రమత్తమైన అధికారులు నౌకలోని వారందరికీ పరీక్షలు ప్రారంభించారు. ఆదివారం రాత్రి 9.30గంటలకు ఓ వైద్య బృందం నౌకలోకి వెళ్లి ప్రయాణికులందరికీ పరీక్షలు ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. వాటి ఫలితాలు వచ్చే వరకు ప్రయాణికులెవరూ నౌక నుంచి దిగేందుకు అనుమతి లేదని వెల్లడించారు. దీంతో నిన్నటి నుంచి వారంతా షిప్‌లోనే చిక్కుకుపోయారు. ఇదిలా ఉండగా.. నౌకలో ఎక్కిన వారంతా రెండు డోసుల టీకా తీసుకున్నవారేనని కార్డెలియా క్రూజ్ ప్రతినిధులు తెలిపారు. కరోనా నిర్ధారణ అయిన వ్యక్తిని ప్రస్తుతం నౌకలోనే ఐసోలేషన్‌లో ఉంచినట్లు చెప్పారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







