ఆదిత్యను సందర్శించిన నేపాల్ ఫార్మసీ కౌన్సిల్ బృందం

UPDATED 9th JUNE 2018 SATURDAY 6:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ ను నేపాల్ కు చెందిన ఫార్మసీ కౌన్సిల్ బృందం సందర్శించినట్లు ఆదిత్య విద్యాసంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ బృందంలో నేపాల్ ఫార్మసీ కౌన్సిల్ చైర్మన్ జోషి కేశవ్ దోజ్, సభ్యులు మోహన్ చౌదరి ఉన్నారు. విశాలమైన భవన సముదాయాలు, అత్యాధునిక ప్రయోగశాలలు, జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్ కలిగిన గ్రంథాలయం, నిష్ణాతులైన అధ్యాపక సిబ్బంది, అత్యాధునిక వసతులు, దేశ, విదేశాలకు చెందిన విద్యార్థులతో అలరారుతున్న క్యాంపస్ ఎంతో అద్భుతంగా ఉందని వారు కొనియాడారు. అనంతరం వారు ప్రాంగణంలోని దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరి వెంట వైస్ చైర్మన్ సతీష్ రెడ్డితో పాటు ఫార్మసీ డైరెక్టర్ డాక్టర్ కె. రవిశంకర్, ఆదిత్య ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వై. సురేంద్రనాథ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us