ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరానికి విశేష స్పందన

UPDATED 7th FEBRUARY 2018 WEDNESDAY 6:30 PM

పెద్దాపురం: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం చినబ్రహ్మదేవం గ్రామంలో ఎంపియుపి పాఠశాలలో నిర్వహించిన ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరానికి విశేష స్పందన లభించినట్లు  శ్రీ శారదా రామకృష్ణ సేవాసమితి అధ్యక్షుడు తోటకూర గంగాధర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ శారదా రామకృష్ణ సేవాసమితి ఆధ్వర్యంలో స్వర్గీయ ఆచంట శ్రీరాములు, సుబ్బలక్ష్మి జ్ఞాపకార్ధం ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ నీరజ సహకారంతో ఈ శిబిరం నిర్వహించినట్లు తెలిపారు. ఈ శిబిరంలో 172 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. డాక్టర్ నీరజ మాట్లాడుతూ అన్ని రకాల వ్యాధులకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మందులు ఆయుర్వేదంలో ఉన్నాయని, ప్రజలకు ఆయుర్వేదంపై అవగాహన కల్పించేందుకు ప్రతీ గ్రామంలో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు పెంటపాటి మల్లిఖార్జునరావు, మండవిల్లి శ్రీనివాస్, గ్రామ పెద్దలు ఆచంట లక్ష్మణరావు, ఆచంట సోమరాజు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.          

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us