జాతీయస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీల్లో గైట్ విద్యార్థుల ప్రతిభ

UPDATED 22nd MARCH 2018 THURSDAY 9:00 PM

రాజానగరం: జాతీయస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీల్లో గైట్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు అత్యుత్తుమ ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచినట్లు గైట్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శ్రీనివాసన్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ తమ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఆకుల వెంకట సాయితేజ, పల్లి.పి.ఎస్.వి.వి. యశ్వంత్ కుమార్ లు అఖిల భారత సౌత్ జోన్ పాలిటెక్నిక్ కళాశాలల క్రీడా పోటీలలో టేబుల్ టెన్నిస్ లో విజేతలుగా నిలిచి బంగారు పతకాలు సాధించారని అన్నారు. ఈ సందర్భంగా విజేతలను చైతన్య సంస్థల చైర్మన్ కె.వి.వి. సత్యనారాయణరాజు ( చైతన్య రాజు), గైట్ మేనేజింగ్ డైరెక్టర్ కె. శశికిరణ్ వర్మ అభినందించి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో పాల్గోవడం వల్ల మంచి శారీరక, మానసిక వికాసం పొందుతారని, విద్యార్థులలో ప్రతిభను గుర్తించి వారికి గల ఆసక్తిని బట్టి ఆయా క్రీడలలో సుశిక్షితులైన వ్యాయమ అధ్యాపకులచే శిక్షణనిచ్చి ప్రోత్సహించడం వల్ల మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారన్నారు. క్రీడాకారుల ప్రోత్సాహానికి అవసరమైన పూర్తి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా విజేతలను చైతన్య విద్యా సంస్థల సిఈవో డాక్టర్ డి.ఎల్.ఎన్. రాజు, జనరల్ మేనేజర్ డాక్టర్ పి. సుబ్బరాజు, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ సి.ఎం హెన్రీ, పాలిటెక్నిక్ కళాశాల పి.డి. పి. శివకుమార్, తదితరులు అభినందించారు.       
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us