సూపర్ కండక్టింగ్ మెటీరియల్ పై మరిన్ని పరిశోధనలు జరగాలి

UPDATED 4rd FEBRUARY 2019 MONDAY 5:00 PM

గండేపల్లి: భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశాల సరసన చేర్చడానికి సూపర్ కండక్టింగ్ మెటీరియల్ పై మరిన్ని పరిశోధనలు జరగాలని ప్రొఫెసర్ ఊటుకూరు వాసుదేవరావు అన్నారు. గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా  సంస్థల ప్రాంగణంలో గల ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో సూపర్ కండక్టర్ మెటీరియల్స్ అప్లికేషన్స్ టు ఎలక్టికల్ ఇంజనీరింగ్ అనే అంశంపై సోమవారం గెస్ట్ లెక్చర్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఐఐటి(ఖరగ్ పూర్) లో క్రయోజనిక్ ఇంజనీరింగ్ సెంటర్ అధిపతిగా రాణిస్తున్న ప్రొఫెసర్ ఊటుకూరు వాసుదేవరావు హాజరై  ఇంటర్ డిసిప్లినరీ రీసర్చ్ ప్రాముఖ్యతను వివరించారు. భారతదేశంలో సూపర్ కండక్టర్ పరిశోధనలో వాసుదేవరావు నిష్ణాతులని, వివిధ ప్రభుత్వ ప్రయివేట్ సంస్థలకు ఆయన తన పరిశోధనల ద్వారా సహకారం అందిస్తున్నారని ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య విద్యా సంస్థలకు చెందిన ట్రిపుల్ ఇ, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతులు, డైరెక్టర్ రీసర్చ్ డాక్టర్ కెవి శ్రీరామచంద్రమూర్తి, తదితరులు పాల్గొన్నారు.  

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us