UPDATED 30th JANUARY 2019 WEDNESDAY 9:00 PM
సామర్లకోట: మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, సీనియర్ కౌన్సిలర్ కరికం గోపాలం బుధవారం తెల్లవారు జామున మృతి చెందారు. అప్పటి మున్సిపల్ చైర్మన్ డాక్టర్ చందలాడ అనంత పద్మనాభం ఏర్పాటు చేసిన పట్టణాభివృద్ధి సంఘం తరఫున తొలిసారిగా మున్సిపల్ కౌన్సిలర్ గా గెలుపొందిన గోపాలం, నాలుగుసార్లు కౌన్సిల్ సభ్యుడిగా ఎస్టీ కోటాలో గెలుపొందారు. ఆయన ఇటీవల అస్వస్థతకు గురి కావడంతో వైస్ చైర్మన్ పదవికి రాజీనామా చేసి ఒకటవ వార్డు సభ్యుడిగా కొనసాగుతున్నారు. కౌన్సిలర్ కరికం గోపాలం మృతి పట్ల మున్సిపల్ చైర్ పర్సన్ మన్యం పద్మావతి చంద్రరావు, ప్రస్తుత మున్సిపల్ వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్రప్రసాద్, సీనియర్ కౌన్సిలర్ మన్యం చంద్రరావు, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, మున్సిపల్ కమీషనర్ సిహెచ్ వెంకటేశ్వరరావు, జిల్లా మానవ హక్కుల పరిరక్షణా సంఘం అధ్యక్షుడు నూతలపాటి అప్పలకొండతో పాటు పలువురు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. అలాగే మున్సిపల్ డిఇ సిహెచ్ రామారావు, మేనేజర్ ఎస్. అచ్యుతరాజు, ఆర్ఓ సిహెచ్ వెంకటేశ్వర్లు, టీపిఓ రత్నాకర్, జేఏవో ఎన్.ఎల్. సంగీత, మాధురి, శ్రీహరి, ఏసుబాబు, తదితరులు మౌనం పాటించి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.







