వ్యక్తి ఉన్నతిలో గురువుదే కీలకపాత్ర

UPDATED 5th SEPTEMBER 2018 WEDNESDAY 9:00 PM

సామర్లకోట: వ్యక్తి ఉన్నతిలో గురువుదే కీలకపాత్ర అని కౌన్సిలర్ పాగా శిరీష సురేష్ కుమార్ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక 29వ వార్డులో ఉన్న బొడ్డు భాస్కరరామారావు ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులను బుధవారం ఆమె ఘనంగా సత్కరించారు. ముందుగా భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కౌన్సిలర్ శిరీష మాట్లాడుతూ గురువులే సమాజానికి మార్గదర్శకులని, ఎంతటివారైనా తమకు జ్ఞానోపాదేశం చేసిన గురువులకు రుణపడి ఉండాల్సిందేనన్నారు. తల్లిదండ్రుల తర్వాత గురువుదే స్థానమని, అలాంటి గురువులు సమాజానికి ఉపయోగపడే విధంగా పిల్లలను తీర్చిదిద్దాలని కోరారు. ప్రతి వ్యక్తి ఎదుగుదల వెనుక గురువు పాత్ర ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాగా సురేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us