ఓటరు నమోదు కార్యక్రమం వేగవంతం చేయాలి

UPDATED 18th SEPTEMBER 2018 TUESDAY 9:00 PM

సామర్లకోట: ఓటరు నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని తహసీల్దార్ ఎల్. శివకుమార్ అన్నారు. డిప్యూటీ తహసీల్దార్ ఎన్. ప్రసాద్ అధ్యక్షతన స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో స్పెషల్ సమ్మరీ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ కు సంబంధించి సామర్లకోట మండలం రూరల్, అర్బన్ పరిధిలోని బూత్ లెవల్ అధికారులు, తదితరులకు మంగళవారం అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శివకుమార్ మాట్లాడుతూ ఎన్నిక కమిషన్ ఆదేశాల మేరకు 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులను ఓటర్లుగా నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఓటరు పేరు మార్పులు, సవరణలు, తొలగింపు, బదిలీలు తదితర విషయాలపై అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమీషనర్ సి.హెచ్. వెంకటేశ్వరావు, రెవిన్యూ, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.      

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us