UPDATED 2nd OCTOBER 2018 TUESDAY 9:00 PM
సామర్లకోట: ప్రజా సమస్యల పరిష్కారానికే జనసేన పార్టీ ఆవిర్భవించిందని జనసేన పార్టీ జిల్లా కోఆర్డినేటర్ ఎం. గురుదత్త ప్రసాద్ అన్నారు. పెద్దాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు తుమ్మల రామస్వామి (బాబు) ఆధ్వర్యంలో సామర్లకోట మండలం జి. మేడపాడు, పెదబ్రహ్మదేవం గ్రామాల్లో వాడవాడలా జనసేన జెండా కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన గురుదత్త ప్రసాద్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై తమ పార్టీ పోరాటం చేస్తుందని, రాబోయే ఎన్నికలలో తమ పార్టీ విజయం సాధించడం తధ్యమని అన్నారు. యువత అంతా జనసేన పార్టీతోనే ఉన్నారని పేర్కొన్నారు. అనంతరం వందలాది మంది యువకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కో ఆర్డినేటర్ శెట్టిబత్తుల రాజబాబు, పేసంగి ఆదినారాయణ, మహిళ జనసేన నాయకులు కడలి ఈశ్వరి, చల్లా లక్ష్మీ, తోలేటి శిరీష, నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.







