UPDATED 27th SEPTEMBER 2018 THURSDAY 9:00 PM
సామర్లకోట: గణపతి నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని స్థానిక బసివిరెడ్డి సత్రం వద్ద శ్రీ లక్ష్మీ గణపతి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పాల్గొని మాట్లాడుతూ అన్నదాన, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ప్రజల్లో భక్తిభావం పెంపొందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, టిడిపి రాష్ట్ర ప్రచార కార్యదర్శి మన్యం చంద్రరావు, శ్రీ కుమారారామ భీమేశ్వరస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ కంటే జగదీష్ మోహనరావు, బడుగు శ్రీకాంత్, కోడెల అర్జునరావు, కాపవరపు కుమార్, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.







