మండలస్థాయి గ్రిగ్ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

UPDATED 27th DECEMBER 2019 FRIDAY 9:00 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్): ఇటీవల నిర్వహించిన మండలస్థాయి గ్రిగ్ పోటీల్లో జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలకు చెందిన విద్యార్థినులు వివిధ క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు  యు. మీనామాధురి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కబడ్డీ సీనియర్స్, ఖో-ఖో సీనియర్స్, ఖో-ఖో జూనియర్స్ విభాగాల్లో విన్నర్స్ గా గెలుపొందారన్నారు. అథ్లెటిక్స్ 100 మీటర్ల పరుగు పందెంలో సీనియర్స్ విభాగంలో పాఠశాలకు చెందిన బి. శిరీష ప్రథమ, కె. నాగసత్య ద్వితీయ స్థానాలను కైవసం చేసుకోగా, షాట్ పుట్ సీనియర్స్ విభాగంలో కె. వర్షిత ప్రథమ స్థానం సాధించారని, వీరు కాకినాడలో జరిగే జోనల్ స్థాయి పోటీలు ఆడేందుకు సిద్ధం అవుతున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయురాలు జి. శ్రీదేవి, ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రుల కమిటీ సభ్యులు, తదితరులు అభినందించారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us