ఘనంగా ఎంపిడివో, ఎంఈవోల పదవీ విరమణ

UPDATED 31st MARCH 2018 SATURDAY 10:00 PM

సామర్లకోట: సామర్లకోట ఎంపిడివో బి.నాగేశ్వరరావు, ఎంఇవో కె.వి. రవణమ్మ పదవీ విరమణ సందర్భంగా స్థానిక టిటిడిసిలో సన్మాన మహోత్సవం శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర  ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప హాజరై మాట్లాడారు. సామర్లకోటలో గత 16 సంవత్సరాలుగా పంచాయతీ రాజ్ శాఖలో వివిధ హోదాలతో పనిచేసి నేడు మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా పదవీ విరమణ చేస్తున్న నాగేశ్వరరావు, అలాగే మండల విద్యాశాఖ అధికారిణిగా పదవీ విరమణ చేస్తున్న కె.వి. రమణమ్మ తమ తమ వృత్తులలో అంకితభావంతో పనిచేశారన్నారు. అనంతరం ఇద్దరిని ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేసారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి సభ్యురాలు గుమ్మళ్ళ విజయలక్ష్మి, సామర్లకోట, పెద్దాపురం మార్కెట్ కమిటీ చైర్మన్లు పాలకుర్తి శ్రీనివాసాచార్యులు, ముత్యాల రాజబ్బాయ, మండల ప్రత్యేక అధికారి అడవి రాజశేఖర్, డివోఇవో ఎల్. గణేష్ బాబు, ,ఈవోపీఆర్డీ సి.హెచ్. జగ్గారావు ,ఇంచార్జి ఎంఈవో శివరామకృష్ణ, సర్పంచుల సమాఖ్య అధ్యక్షుడు కుర్రా నారాయణ స్వామి, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు. 
 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us