నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లే భాద్యత కార్యకర్తలదే

UPDATED 7th JUNE 2018 THURSDAY 9:00 PM

సామర్లకోట: నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లే భాద్యత కార్యకర్తలదేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు అన్నారు. స్థానిక పెన్షన్ లైన్ మూడవ వార్డులో పట్టణ మహిళా కన్వీనర్ కానేటి ఎలిజబెత్ రాణి అధ్యక్షతన గురువారం నిర్వహించిన నియోజకవర్గ పార్టీ బూత్ కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ కో ఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు హాజరై మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిత్యం ప్రజల సమస్యల కోసం పోరాడుతూ, ప్రజల్లో మమేకమై ఎన్ని అవాంతరాలు ఎదురైనా ప్రజా సంకల్ప యాత్ర కొనసాగిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించడం తథ్యం అన్నారు. ఈ నెల 12వ తేదీన ప్రజా సంకల్ప యాత్ర రాజమహేంద్రవరం చేరుకుంటున్న సందర్భంగా నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు ఆవాల లక్ష్మీ నారాయణ, కంటే వీరరాఘవులు, పట్టణ కార్యదర్శి సేపేని సురేష్, పెద్దాపురం యూత్ నాయకుడు గోపు మురళి, పట్టణ కోశాధికారి శెట్టిబత్తుల దుర్గ, తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us