అమ్మఒడి ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే వర్తింపజేయాలి

UPDATED 26th JUNE 2019 WEDNESDAY 9:00 PM

సామర్లకోట: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకాన్ని ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే వర్తింపజేయాలని ఎంఎల్సీ రాము సూర్యారావు అన్నారు. స్థానిక అయోధ్యరామాపురంలోని మున్సిపల్ ఉన్నత పాఠశాలను ఆయన బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి పిడిఎఫ్ ఎంఎల్సీలు పనిచేస్తారని, పాఠశాలల్లకు సంబంధించిన ఏవిధమైన సమస్యలనైనా తన దృష్టికి తేవాలని అన్నారు. ప్రతీ పిల్లవాడు పాఠశాలలో ఉండేలా ఉపాధ్యాయుల సామాజిక భాద్యతను గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం తోటకూర సాయిరామకృష్ణ, యూటీఫ్ నాయకులు కృష్ణమూర్తి, వీరన్న, ఉపాధ్యాయులు గోవిందు, అరుణ, కెవివి సత్యనారాయణ, ఏ.ఎల్.వి. కుమారి, తాళ్ళూరి వైకుంఠం, కె. శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us